Wednesday, October 16, 2024

బాబోయ్.. 215వ సారి నామినేషన్ వేసేశాడు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం నామినేషన్‌ల పర్వం మొదలైంది. తొలి రోజున ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సహా పలువురు స్వత్రంత అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో పద్మరాజన్‌(62) కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఈయన పేరు ఎందుకు ప్రత్యేకమంటే తమిళనాడులో ఏ ఎన్నిక జరిగినా ఆయన నామినేషన్ వేస్తుంటారు. అలా ఈసారి 215వ సారి ఆయన నామినేషన్ దాఖలు చేయడం విశేషం. మేట్టూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.

గిన్నిస్‌బుక్‌లో చోటే లక్ష్యంగా అన్ని ఎన్నికల్లో నామినేషన్ వేస్తుంటారు పద్మరాజన్. 8వ తరగతి మాత్రమే చదువుకున్న పద్మరాజన్‌ సహకార సంఘాల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు నామినేషన్లు వేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. తన ఇంటికి టెలిఫోన్‌ కావాలని 1988లో తొలిసారిగా అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేశారు ఎక్కువగా ప్రముఖుల స్థానాల్లో పోటీ చేసే ఈయన.. డిపాజిట్‌కు డబ్బు లేకపోతే భార్య నగలు కుదువపెట్టి మరీ నామినేషన్ వేసిన ఘనత ఈయన సొంతం.

Advertisement

తాజా వార్తలు

Advertisement