Saturday, April 20, 2024

60 ఏళ్ల వయసులో మోహన్ లాల్ కండలు చూశారా ?

మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. పాత్ర ఎలాంటిదైనా మోహన్ లాల్ అందులో జీవిస్తూ ప్రేక్షకులను కట్టి పడేస్తారు. 40 ఏళ్ళ వయస్సులో కూడా మోహన్ లాల్ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఇక తాజాగా ఆయన జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నా వీడియోను ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

అంతే కాదు వరౌట్స్ చేస్తే శరీరంతో పాటు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా దృఢంగా ఉంటామని ఆయన ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వయసులో కూడా మోహన్ లాల్ చేస్తున్న వర్కౌట్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/tv/CMUlURfHk3X/?igshid=rf9c1rdqw5lm
Advertisement

తాజా వార్తలు

Advertisement