Thursday, May 2, 2024

సెప్టెంబర్‌ 20 నుంచి ఆసీస్‌, సఫారీలతో టీ20 సిరీస్‌లు.. షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ

భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. ఆసియాకప్‌ టోర్నమెంట్‌ అనంతరం దేశీయంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో వరుసగా టీ20 సిరీస్‌లను టీమిండియా ఆడబోతోంది. ఇటు సఫారీలు, అటు ఆసీస్‌ జట్టుతో మూడేసి టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లను బీసీసీఐ ఖరారు చేసింది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్‌ 20 నుంచి 25 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్‌ 20న మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరుగనుండగా, 23న నాగ్‌పూర్‌, 25న హైదరాబాద్‌లో రెండు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక సెప్టెంబర్‌ 28నుంచి అక్టోబర్‌ 3 వరకు సఫారీలతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు ఆడనుంది.

తిరువనంతపురం, గువహటి, ఇండోర్‌ల వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అక్టోబర్‌ 6, 9, 11వ తేదీల్లో వరుసగా రాంచీ, లక్నో, ఢిల్లిలలో మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ ఏడాది దక్షిణాఫ్రికా భారత్‌కు రావడం ఇది రెండోసారి అవుతుంది. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా- టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement