Friday, May 3, 2024

Big Story | ఎత్తిపోసేందుకు స్వర్ణ, సాత్నాల రెడీ.. ఖరీఫ్‌ పంటల‌కు ఢోకా లేదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఖరీఫ్‌ పంటకు సాగునీటి సమస్య రాకుండా నిర్మాణదశల్లో ఉన్న రిజర్యాయర్ల పనుల్లో వేగం పెంచి పనులు పూర్తి చేసేందుకు సాగునీటి పారుదల శాఖ శ్రమిస్తోంది. జిల్లాలవారిగా జలాశయాలు, ఎత్తిప్తోల ప్రాజెక్టులు, చెెరువులను నీటి నిల్వకోసం సిద్ధంచేస్తోంది. వర్షాకాలంలో పూర్తి స్థాయిలో నీటినిల్వచేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను పునరుద్ధరించి సాగునీటి సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచేందుకు కార్యచరణ ప్రణాళికకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో జలాశయాల పెండింగ్‌ పనులు పూర్తి చేసి వర్షాకాలం నీటిని జలాశయాల్లో నింపేందు పనుల్లో వేగం పెంచారు.

సిద్ధమైన సాత్నాల ఎత్తిపోతల

ఎగువప్రాంతాలకు నీటిని ఎత్తిపోసేందుకు ఆదులాబాద్‌ జిల్లా సాత్నాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు పూర్తి అయ్యాయి. జైనాథ్‌ మండలం కప్న గ్రామం దగ్గర సాత్నాల నదిపై రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. గతసమైక్య పాలకులు నిర్లక్ష్యంగావదిలిన పనులను ఇరిగేషన్‌ శాఖ పూర్తి చేసింది. రూ. 28కోట్ల 61 లక్షలతో గడువులోగా పనులు పూర్తి చేసి ప్రస్తుతం ఖరీఫ్‌ కు నీరు అందించేందుకు సిద్ధమైంది. అయితే ప్రస్తుత ఖరీఫ్‌ కాలంలో 18వేల ఎకరాలకు నీటి విడుదలకు పనులు పూర్తి అయ్యాయి. పంటకాలువలు, ప్రాజెక్టు పూడిక, సిమెంట్‌ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది.

అయితే తొలుత రూ. 28కోట్ల 61 లక్షల వ్యయం కాగా ప్రస్తుతం పెరిగిన ధరలు, ప్రాజెక్టు ఆధునీకరణకోసం అంచెనా వ్యయాన్ని రూ. 80 కోట్లకు సవరించారు. ప్రతిపాదిత సామర్ధ్యం 24 వేల ఎకరాలున్నప్పటికీ ప్రస్తుతం 18వేల ఎకరాల సామర్ధ్యంతో పనులు పూర్తి అయ్యాయి. వర్షాకాలం అనంతరం ప్రాజెక్టు సామర్ధ్యాన్ని మరింత పెంచి మరో 4వేల ఎకరాలకు నీరుఅందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎగువన ఉన్న వ్యవసాయ భూములకు ఎత్తిపోతల ద్వారా నీరు పారిస్తోంది. ఇప్పటి వరకు బోర్లు, వర్షాలపై ఆధారపడిన రైతులు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

స్వర్ణ ప్రాజెక్టు స్థిరీకరణ

కాళేశ్వరం ప్రాజెక్టు 27వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న స్వర్ణ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుత మున్న ఆయకట్టుతో పాటుగా మరో 5వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు పునరుద్ధరణ జరిగింది.ఈ ప్రాజెక్టు నీటిని ఎగువప్రాంతాల్లోనికి ఎత్తిపోసి పారిశ్రామిక పంటలను ప్రోత్సహించాలనే ఆలోచనతో త్వరితగతిన పనులు పూర్తి చేశారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే కాళేశ్వరం నుంచి స్వర్ణ ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోసేందుకుఅవసరమైన మోటర్లను బింగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ లో 8వేల 945 ఎకరాలకు సాగునీరు అందటంతోపాటుగా సుమారు 2వేల ఎకరాల ఆయకట్టుస్థిరీకరణ జరగనుందని అధికారులు అంచెనా వేస్తున్నారు.

అయితే నిర్మల్‌ జిల్లా లోని స్వర్ణ నదిపై 1967లో ప్రాజెక్టు రూపకల్పనచేసినప్పటికీ మరమ్మత్తులకు నోచుకోలేక సామర్ధ్యం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లకు అత్యవసర మరమ్మతులకోసం రూ. కోటీ 90 లక్షల వేయి కేటాయించి పనులు పూర్తి చేశారు. అలాగే ప్రాజెక్టు హెడ్‌ వర్క్‌ పునరుద్ధరణ కోసం జీఓ నం. 500 మేరకు రూ. 4కోట్ల 13లక్షల 60వేలు కేటాయించి హెడ్‌ వర్క్‌ పునరుద్ధరణ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే కాలువల ఆధునీరకణ కోసం రూ. 999 లక్షలు కేటాయించి పనులను పురోగతిలో ఉంచారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానించి నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఈ ప్రాజెక్టుకు ఉండటంతో రెండుపంటలకు నీరు పుష్కలంగా అందుతాయని ప్రభుత్వం అంచెనావేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement