Friday, April 26, 2024

ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించే మామ అల్లుడు..

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డ్కెరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ -హబ్రిడ్‌ అల్లుడు’. మార్చి 3న ఈ

చిత్రం ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా మీడియాతో ముచ్చ టించారు దర్శకులు ఎస్‌.వి. కృష్ణారెడ్డి…
సోహల్‌ ఖచ్చితంగా పెద్ద హరో అవుతాడు. మనసుకు హత్తుకుపోయే క్యారెక్టర్‌ అతనిది. అతని పాత్రకు అనుగుణంగానే మిగిలిన పాత్రలు బిహవ్‌ చేస్తాయి. సోహల్‌ క్యారెక్టర్‌ ద్వారా అంతర్లీనంగా ఒక మంచి మెసేజ్‌ను చెపుతూనే.. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేలా స్క్రన్‌ప్లే రాశాను. నా గత చిత్రాలు మాయలోడు, వినోదం, పెళ్లాం ఊరెళితే.. చిత్రాల తరహాలోనే హలేరియస్‌ కామెడీ ఉంటుంది. అందుకే అంత మంది అద్భుతమైన కమెడియన్‌లను తీసు కున్నాం. మా లక్ష్యం ఒక్కటే.. ప్రేక్షకుల గుండెలను బరువెక్కిస్తూనే.. వారిని రిలాక్స్‌ చేయడం కోసం మళ్లి కామెడీ పూతలు పూస్తూనే ఉంటాం. ఖచ్చితంగా మళ్లి నా మార్క్‌ను ఈ సినిమా ద్వారా చూపించ బోతున్నాను. నేనే కాదు.. ప్రతి మనిషి.. ప్రతి రోజునూ నిన్నటి వరకూ ఒక లెక్క.. ఈ రోజు నుంచి మరో లెక్క అని ప్రారంభిస్తే ప్రతి రోజూ కొత్తగానే కనిపిస్తుంది.. అనిపిస్తుంది. అదే వారిని సక్సెస్‌కు దగ్గర చేస్తుంది. ఆర్గానిక్‌ సెంటిమెంట్‌.. ఆర్గానిక్‌ కామెడీ.. ఆర్గానిక్‌ సంగీతం.. ఒక చిన్న ఆర్గానిక్‌ మెసేజ్‌తో మెప్పించబోతున్నాం.ఎన్ని రోజులు ఎదురు చూసామో.. ఇవన్నీ మాకు అద్భుతమైన అనుభూతులు పంచడం వల్లే ఈ సినిమా ఇంత చక్కటి ట్రాక్‌లోకి వచ్చింది. ఒక నిర్మాతకు తన సినిమా మీద ప్యాషన్‌ లేకపోతే.. ఎంత గొప్ప దర్శకుణ్ణి పెట్టినా అది ఉప్పులేని పప్పులాగే ఉంటుంది. ఏ ప్రాజెక్ట్‌లో నిర్మాత పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవుతారో.. అది ఒక అద్భుతమైన వేలోకి వెళుతుంది. కల్పన గారిలా ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement