Wednesday, May 1, 2024

దూసుకుపోతోన్న సుగుణ సుంద‌రి సాంగ్.. ఇప్ప‌టి వ‌ర‌కు 10మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్

హీరో బాల‌కృష్ణ న‌టించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి..హీరోయిన్ గా శృతిహాస‌న్ న‌టిస్తోంది. కాగా ఈ చిత్రం నుండి సుగుణ సుంద‌రి పాటని రిలీజ్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కు 10మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్ ని రాబ‌ట్టింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. జనవరి 12వ తేదీన వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలబడుతుందని తమన్ చెప్పడం విశేషం.

బాలకృష్ణ హీరోగా ‘వీరసింహారెడ్డి’ సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో బాలయ్య వేసిన మార్కు చెదిరిపోనిది. ఆ జోనర్లో బాలయ్య చేసిన సినిమాలు దాదాపుగా కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఇప్పుడు అదే జోనర్లో ఈ సినిమా నిర్మితమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement