Sunday, May 5, 2024

గత ఏడాది నుంచే బీబీనగర్ ఎయిమ్స్‌లో శస్త్రచికిత్సలు.. రేవంత్ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరానికి సమీపంలోని బీబీనగర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వైద్యవిద్యా సంస్థ ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 2021 నుంచే శస్త్రచికిత్సలు మొదలయ్యాయని కేంద్రం తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ 2021లో 26 సర్జరీలు జరిగాయని, ఇప్పటి వరకు మొత్తం 294 ప్రధాన శస్త్రచికిత్సలు జరిగాయని వెల్లడించారు. మైనర్ సర్జరీలైతే 3,600కు పైగా జరిగాయని తెలిపారు.

బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభ దశలో ఉందని, గతంలో పాక్షికంగా నిర్మించిన భవన సముదాయం నుంచే ప్రస్తుతం క్లినికల్ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అనస్థీషియా విభాగంలో రెగ్యులర్ ఫ్యాకల్టీ 2020 డిసెంబర్ నెలలో చేరారని, వివిధ సర్జికల్ విభాగాల్లో 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు నియామకాలు జరిగాయని ఆమె వివరించారు. ఇంకా మిగిలి ఉన్న 94 బోధనా సిబ్బంది నియామకం కోసం జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement