Thursday, April 25, 2024

లఖింపుర్ ఖేరి ఘటనపై సుప్రీం కోర్టు సీరియస్

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఘటనపై ఆరాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ల‌ఖింపూర్ ఖేరిలో చెల‌రేగిన హింస‌లో 8 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌పై దాఖ‌లు అయిన సుమోటో కేసును శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. యూపీ స‌ర్కార్ త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ హ‌రీశ్ సాల్వే త‌ర‌పున వాదించారు.  ల‌ఖింపుర్‌ ఘ‌ట‌న‌లో యూపీ పోలీసులు నిర్వ‌హిస్తున్న ద‌ర్యాప్తు సంతృప్తిక‌రంగా లేద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఈ ఘటనపై దసరా తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. అయితే, అప్పటి వరకు అన్ని సాక్ష్యాలను పరిరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంత వరకు యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: ఫ‌స‌ల్ బీమాతో లాభం లేదు: కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement