Sunday, May 5, 2024

అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష.. ఆ ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటించన సుప్రీంకోర్టు

2012లో ఉత్తరాఖండ్‌కు చెందిన చావ్లా అనే 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరణశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులను సుప్రీంకోర్టు ఇవ్వాల (సోమవారం) నిర్దోషులుగా ప్రకటించింది. ముగ్గురు నిందితులు 2012 ఫిబ్రవరిలో ఓ యువ‌తిని కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసినట్టు ఆరోపణ‌లు ఎదుర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్‌కు గురైన మూడు రోజుల తర్వాత ఆ యువ‌తి మృతదేహం దొరికింది. యువ‌తిని కిడ్నాప్ చేయడం, అత్యాచారం చేసి హత్య చేయడం వంటి నేరాలకు ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించిన తర్వాత రాహుల్, రవి, వినోద్‌కు మరణశిక్ష విధించింది. అయితే, వీరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇవ్వాల‌ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖండిస్తూ ‘‘11 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు దారుణం. మేము ఓడిపోయాం. ఈ తీర్పు ఎంతోమందికి కనువిప్పు కలిగిస్తుందని ఎదురుచూశాం. ఇన్ని రోజులు నేను జీవించడానికి కారణం లేదని భావిస్తున్నా. నా కుమార్తెకు న్యాయం జరుగుతుందని అనుకున్నా’’ అని మృతురాలి తల్లి అన్నారు.

కేసు పూర్వాపరాలు ఏంటంటే..

ఉత్తరాఖండ్‌కు చెందిన ఆ యువతి గుర్గావ్‌లోని సైబర్ సిటీ ప్రాంతంలో పనిచేస్తోంది. ఫిబ్రవరి 2012లో ఆమె తన వర్క్ ప్లేస్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెను వెంబడిస్తూ వచ్చి కారులో కిడ్నాప్​ చేశారు. దీంతో ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత హర్యాణాలోని రేవారీ గ్రామంలో ఆ యువతి మృతదేహం కనుగోన్నారు పోలీసులు. ఆమె శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు. ఆపై యువతి మృతదేహాన్ని అటాప్సీకి పంపగా.. కారు పనిముట్లు, గాజు సీసాలు, మెటల్ వస్తువులు, ఇతర ఆయుధాలతో ఆమే శరీరంపై దాడి చేసినట్లు తేలింది. ఆమెపై అత్యాచారం కూడా జరిగిందని పోస్ట్​మార్టమ్​లో వెల్లడయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement