Friday, April 26, 2024

Big Story : ప్లోరైడ్‌ కు శాశ్వత పరిష్కారం.. మునుగోడు నియోజకవర్గానికి డిండీ సాగునీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పొరుగు రాష్ట్రం సృష్టించిన అవరోధాలకు ఎదురొడ్డి ప్లోరైడ్‌కు శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ పట్టుదలతో నిర్మిస్తున్న డిండీ ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల పనులు 70 శాతం పూర్తి అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరాల మేరకు జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టు ఆక్షేపణలు విధించినప్పటికీ పర్యావరణానికి భంగం వాటిళ్లకుండా నిర్మాణ పనులు ముందుకు సాగాయి. గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సభ్యులుప్రాజెక్టుల పర్యావేక్షణలు పూర్తి చేసి వివరాలు కోరగా రాష్ట్ర నీటి పారుదల శాఖ గ్రీన్‌ ట్రబ్యునల్‌ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

అయితే ట్రిబ్యునల్‌ స్టే ఎత్తివేసిన మరుక్షణమే ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మునుగోడులో విజయ కేతనం ఎగరవేసిన టీఆర్‌ఎస్‌ అదేస్ఫూర్తితో పనుల్లో వేగం పెంచి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ డిండీ ఎత్తిపోతల పథకం ప్రారంభించి మునుగోడు భూగర్భజలాల్లోని ప్లోరైడ్‌ ను తరిమివేసేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మునుగోడు కుస్వచ్ఛమైన సాగునీరు అందించి భూగర్భంలో పేరుకు పోయిన ప్లోరైడ్‌ ను నాశనం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణబద్దమైంది. ప్రజల అకాంక్షలను నెరవేర్చడంతో పాటు ఇచ్చిన ప్రతిహమీని నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. డిండీ ఎత్తిపోతల పథకంలోని ప్రాజెక్టులద్వారా నీరు పారిస్తే నల్గొండ జిల్లాలోని మునుగోడు,దేవరకొండ నియోజకవర్గాల్లో 3.50 లక్షల ఎకరాల్లో నీరుపారనుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా డిండీ ఎత్తిపోతల రిజర్వాయర్ల నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సీఎం కేసీఆర్‌ ఈ ప్రాజెక్టు పనులను 15 జూన్‌ 2015న ప్రారంభించారు.

వేగం పుంజుకున్న రిజర్వాయర్ల నిర్మాణాలు

పురుసంపల్లి కొండల్లో పుట్టి అతిప్రాచీనమైన దుందుభీ క్షేత్రం నుంచి కృష్ణానదికి ఉపనదీ గా డిండీ ప్రవహిస్తుంది. డిండీ ప్రాజెక్టు పొంగిపొరలుతున్నా ఎగువప్రాతంలాకు నీరు అందించే రిజర్వాయర్ల నిర్మాణాలను గత ఉమ్మడి పాలకులు విస్మరించగా తెలంగాణ ఉద్యమసమయంలో సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్వరాష్ట్రంలో ప్రాజెక్టు పనులను చేపట్టారు. ఆరువేల 200లకోట్ల తో ప్రారంభించిన ఈ ఎత్తిపోతల పథకాలు అంచనావ్యయం దాటిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ ట్రిబ్యునల్‌ లోవేసిన కేసుఫలితంగా 30 శాతం పనులు పెండింగ్‌ లో పడటం. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ప్రాంతంలోని నక్కలగండినీటిని తరలించి అక్కడి నుంచి రిజర్వాయర్లకు 30 టీఎంసీలను తరలించడం. డిండీ ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోిని కృష్ణారాం పల్లి రిజర్వాయర్‌ నిర్మాణం 5.686 టీఎంసీల సామర్థ్యంతో లక్షఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి.

అలాగే మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం చర్ల గూడ దగ్గర శివన్నగూడెం రిజర్వాయర్‌ి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్‌ తో 11.968 టీఎంససీల సామర్థ్యంతో లక్షా 55 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి రానున్నాయి. అలాగే తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించనుంది. డిండీ మండలంలో 0.056 టీఎంసీల కేటాయింపుతో నిర్మిస్తున్న సింగరాయిపల్లి రిజర్వాయర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 13వేల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల రిజర్వాయర్‌ పనులు వేగం అందుకున్నాయి. ఈ ప్రాజెక్టుతో 1.075 టీఎంసీ సామర్థ్యంతో 39 గ్రామాలకు తాగునీరుతో పాటుగా 28 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. 0.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న చింతపల్లి రిజర్వార్‌ పూర్తి అయితే 10వేల ఎకరాలకు నీరు అందనుంది.

- Advertisement -

మిషన్‌ భగీరథ తో తాగునీరు అందించి మునుగోడు,దేవరకొండ తదితర నల్గొండ జిల్లా గ్రామాల్లో ప్లోరైడ్‌ ను తరిమివేసిన సీఎం కేసీఆర్‌ భూగర్భంలో పేరుకు పోయిన ప్లోరైడ్‌ సమస్యపరిష్కారం కోసం సిద్ధమయ్యారు. మునుగోడు నియోజక వర్గం విజయోత్సవాల్లో భాగంగా ఈనియోజకవర్గంలోడిండీ ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి ప్లోరైడ్‌ను శాశ్వతంగా తరిమి వేసేందుకు సిద్ధమయ్యారు. డండీఎత్తిపోతల పథకంలో భాగంగా 7 రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉండగా ఇంకా చింతపల్లి, గోకర్ణ పనులు ప్రారంభం కాలేదు. అలాగే కాలువల తవ్వకాలు ప్రారంభం కాలేదు. మొదటి ప్రాధాన్యతగా రిజర్వాయర్లను ప్రభుత్వం నిర్మిస్తుంది. తరతరాల ప్లోరైడ్‌ గోసనుంచి ప్రజలకు శాశ్వత విముక్తి కలిగించేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషీని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అభినందిస్తుందా…స్టే నుకొనసాగిస్తుందో వేచి చూడాలి.

కేంద్రం వివాదాలను సృష్టిస్తుంది

అంతరాష్ట్ర జలవివాదాలను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం వివాదాలను ప్రేరణ ఇస్తుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వి.ప్రకాష్‌ చెప్పారు. ఎన్జీటి స్టే ను తొలగించేందుకు చొరవ చూపాల్సిన కేంద్రం తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆయన నిందించారు. డండీ ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్ల పనులు జరుగుతున్నప్పటికీ స్టే ఉండటంతో పైపులైన్‌, కాలువలు, మాటర్ల బిగింపు జరగాల్సి ఉందన్నారు. నికరకజలాల వాటాలు తేల్చకపోవడం ప్రధాన సమస్యగా మారిందని విచారం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్‌ నీటి వాటాలు తేల్చితే వాటాల మేరకు ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం అవుతాయన్నారు. ప్లోరైడ్‌ ప్రాంతాలకు సాగునీరు అందించే డిండీ ప్రాజెక్టు రిజర్వాయర్ల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ఎన్జీటీ సహకరించాలని, సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement