Friday, May 17, 2024

విన్న‌ర్ అయ్యేందుకు స‌న్నీ..మాన‌స్ ల మ‌ధ్య గ‌ట్టి పోటీ..

బిగ్ బాస్5 గ‌త సీజ‌న్ల‌కు భిన్నంగా ఈసారి హౌస్ లోకి 19మంది కంటెస్టెంట్ల‌ను పంపారు నిర్వాహ‌కులు. వారాలు గడుస్తున్న కొద్ది కొత్త టాస్క్ లు..ఆట‌ల‌తో రసవత్తరంగా మారిపోయింది. మొదటి మూడు వారాలు చ‌ప్ప‌గా సాగిన షో.. నాలుగో వారం నుంచి మార్పు క‌నిపిస్తోంది. హౌస్ లో కంటెస్టెంట్స్ ఆట తీరులో మార్పు వచ్చింది. అయితే బిగ్ బాస్ ఇంట్లోకి రాకముందు జనాలకు తెలిసిన కంటెస్టెంట్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు..

యాంకర్ రవి.. యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, ప్రియా, సన్నీ, ఉమాదేవి, శ్రీరామ్, మానస్, లోబో, నటరాజ్ మాస్టర్, కాజల్‏లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉండేది. ఇక లహరి, శ్వేత, హమిదా, సరయు, విశ్వ అంతకు ముందు జనాలకు అంతగా తెలియదు.
కాగా బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే దాదాపు సగం ఆట పూర్త‌యింది. దీంతో ఒక్కో కంటెస్టెంట్ గురించి పూర్తి క్లారిటీ కూడా వచ్చేసింది. అందుకు అనుగుణాంగానే వాళ్ల ఆట తీరు.. ప్రవర్తన చూసి ఓట్లు వేస్తున్నారు ప్రేక్ష‌కులు.

ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు.. టాప్ 5 లో ఎవరెవరుంటారు అనే దానిపై నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి విన్నర్ అయ్యేందుకు సన్నీ… మానస్ ల‌ మధ్య గట్టి పోటీ ఉండబోతుందని స‌మాచారం. వీరిద్దరిలో ఒకరు విన్నర్ కావడం.. మరొకరు రన్నర్ అప్ గా నిలవబోతున్నార‌నే టాక్ వినిసిస్తోంది. అలాగే టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్‏లో యూట్యూబర్ షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్, సన్నీ ఉండనున్నార‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఏంజ‌రుగుతుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement