Friday, May 3, 2024

సునీల్‌ ఛెత్రికి మరో అరుదైన ఘనత

ఇండియన్ స్టార్ ఫుట్‌బాలర్‌ సునీల్‌ ఛెత్రికి మరో అరుదైన ఘనత దక్కింది. ఏఎఫ్సీ ఆసియా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఆల్‌టైమ్‌ ముగ్గురు ఉత్తమ స్ట్రయికర్లలో ఛెత్రి ఒకడిగా ఎంపికయ్యాడు. ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించగా మొత్తం 13మంది క్రీడాకారులను టాప్‌-3 బెస్ట్‌ స్ట్రయికర్స్‌గా ఫ్యాన్స్‌ ఎంపిక చేశారు. ఏఎఫ్సీ కప్‌లో 2013 నుంచి ఛెత్రి మొత్తం 18 గోల్స్‌ సాధించాడు. 2016లో సునీల్‌ సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ జట్టు రన్నరప్ గా నిలిచింది. సునిల్ ఛెత్రి ప్రస్తుతం అత్యధిక గోల్స్ సాధించిన వారిలో భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement