Saturday, May 18, 2024

మే 1 నుంచి సాలార్ జంగ్ మ్యూజియంలో సమ్మర్ ఆర్ట్ క్యాంప్..

సాలార్ జంగ్ మ్యూజియం విద్యా కార్యకలాపాల కింద మే 1 నుండి మే 17 వరకు పాఠశాల విద్యార్థుల కోసం సమ్మర్ ఆర్ట్ క్యాంప్-2023ని నిర్వహించనున్నట్టు అధకారులు ప్రకటించారు. కాగా, ఈ సమ్మర్ ఆర్ట్ క్యాంప్ లో విద్యార్థుల వయస్సు ఆధారంగా వారిని జూనియర్లు (8-11 సంవత్సరాలు), సీనియర్లు (12-15 సంవత్సరాలు) వర్గాలుగా వర్గీకరిస్తారు. ఎంపికైన విద్యార్థులు “ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా & ఆర్ట్ ఆఫ్ లివింగ్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఇండియన్ ఆర్ట్స్, హెరిటేజ్ అవేర్‌నెస్ అండ్ మ్యూజియం అవేర్‌నెస్”, డ్రాయింగ్ (పాస్టెల్స్ & పెన్సిల్), పెయింటింగ్ (క్రేయాన్స్, వాటర్ కలర్స్), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్’’ వంటి వివిధ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు.

అయితే, గత రెండేళ్లలో పాల్గొనని అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మ్యూజియం యాజమాన్యం పేర్కోంది. ఈ సమ్మర్ క్యాంప్ లో పాల్గొనాలి అనుకునే విద్యార్థులు రూ.700 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తిగల విద్యార్థులు మ్యూజియం రిసెప్షన్ కౌంటర్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను సేకరించి, ఏప్రిల్ 24లోగా సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా ఏప్రిల్ 25న ప్రకటించబడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement