Monday, May 6, 2024

సుడిగాలి సుధీర్ చేసిన ప‌నికి అవాక్క‌యిన జ‌డ్జిలు – నెటిజ‌న్స్ కామెంట్స్

జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షో పై ఎన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా..ఈ షో మాత్రం దూసుకుపోతూనే ఉంది. ఈ షోలో స్టార్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ ని ‘మన్మథుడి’లా, అమ్మాయిల పిచ్చోడిలా చిత్రీకరించడం ఎన్నో సార్లు చూశాం. పార్టిసిపెంట్స్ మొదలుకొని, జడ్జ్ రోజా వరకు అమ్మాయిల విషయమై సుధీర్‌పై పరోక్షంగా పంచులేయడం కామన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో కనిపించిన ఓ సీన్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో గెటప్ శ్రీను, సుధీర్‌ సంభాషణ హైలైట్ అయింది. వీళ్లిద్దరి డైలాగ్స్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు జనం. సుధీర్‌తో గెటప్ శ్రీను.. ‘నేను ఇచ్చిన ఐదు వేల రూపాయలు ఏం చేశావ్’ అని అడగ్గా..

దీనిపై సుధీర్ రియాక్ట్ అవుతూ అసలు మ్యాటర్ చెప్పేయడంతో అంతా అవాక్కయ్యారు. ఆఫీస్ నుంచి వస్తుంటే ఓ అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఇద్దరం వెళ్తుండగా చాలా వర్షం వచ్చింది. తడిసిపోయిన బట్టలతో అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేస్తే బాగోదని చెప్పి దగ్గరలో ఉన్న ఓ హోటల్‌లో రూమ్ తీసుకుని ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం’ అనేశాడు సుధీర్. ఇది విని గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, రష్మీ సహా రోజా అంతా తెగ నవ్వేశారు. అయితే ఈ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందికరంగా ఉన్నాయని, స్కిట్స్‌లో మరీ ఇంత శృతిమించితే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అలా అని షోని చూడ‌టం మానేస్తున్నారా అంటే అదీ లేదు. ఇక హీరోగా కూడా తెగ ట్రై చేస్తున్నాడు సుధీర్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement