Saturday, May 18, 2024

వ్యూహం ట్రైల‌ర్ రిలీజ్.. సోనియా గాంధీని వ‌ద‌ల‌ని ఆర్జీవీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ వ్యూహం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆర్‌జీవి విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్‌ చేశారు. రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న వ్యూహం ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో తనదైన మార్కుతో చూపించాడు వర్మ.

YouTube video

ఇక ఈ ట్రైల‌ర్‌లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై, జగన్ పై చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్‌ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. తొలిపార్టులో YSR మరణం తర్వాత ఏం జరిగిందని, రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement