Friday, June 21, 2024

దళితుల జోలికొస్తే ఉరికించి.. ఉరికించి కొడతాం: టి.రాజయ్య

ఈటెల రాజేందర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఏడేళ్లు అధికారాన్ని అనుభవించి అదే అధికారం సహాయతో దళితులు, దేవాలయాల భూములను ఈటెల కబ్జా చేశారని, ఆయన దళిత ద్రోహి అని ఆరోపించారు. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగానే దళిత బంధు పథకం తెచ్చారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను టి.రాజయ్య ఖండించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముందే ఫిబ్రవరి 10న దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఏప్రిల్ 14న అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని, అయినా కారుకూతలు కూస్తున్న గోనె ప్రకాశరావు, పద్మనాభరెడ్డిలకు సిగ్గు, శరం లేదని మండిపడ్డారు. దళితుల పట్ల అసభ్యకరంగా, అభ్యంతరకరంగా మాట్లాడుతున్న వీరిద్దరిపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఈటెలకు కొమ్ముకాస్తున్న మధుసూదన్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని టి.రాజయ్య హితవు పలికారు. ఎవరైనా దళితుల జోలికొస్తే ఉరికించి.. ఉరికించి కొడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ పథకం అయినా ఆనవాయితీగా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తుందని.. ఇప్పుడు దళిత బంధును కరీంనగర్ నుంచి ప్రారంభిస్తామని చెప్పగానే ఈటెలకు చెమటలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఈ వార్త కూడా చదవండి: కేసీఆర్‌వి చిల్లర రాజకీయాలు: ఈటెల

Advertisement

తాజా వార్తలు

Advertisement