Sunday, April 28, 2024

వచ్చే 3 రోజుల్లో 51 లక్షల డోసులు!

దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా కేసులు నానాటికీ పెరుగుతుంటే మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్‌ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కరోనా కట్టడికి అనేక రాష్ట్రాలు లాక్‌ డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తుండటంతో వ్యాక్సిన్‌ తీసుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. రాబోయే మూడు రోజుల్లో 51లక్షల వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటివరకూ 20కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోస్‌లను కేంద్రం ఉచితంగా రాష్ట్రాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. మే 14వ తేదీ వరకూ 18.43కోట్ల వ్యాక్సిన్‌ డోసులు(వృథాతో కలిపి) అందించారు. ‘ప్రస్తుతం రాష్ట్రాల  వద్ద 1.84కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి. పలు రాష్ట్రాలు తమ వద్ద వ్యాక్సిన్‌ డోస్‌లు కొరత ఉన్నట్లు చూపిస్తున్నాయి. పూర్తి వివరాలను మరోసారి పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరో మూడు రోజుల్లో 50,95,640 వ్యాక్సిన్‌ డోస్‌లను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని కేంద్రం ఆరోగ్యశాఖ  తెలిపింది.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్‌లో పది రోజుల్లో 1000 మందికిపైగా చిన్నారులకు కరోనా..

Advertisement

తాజా వార్తలు

Advertisement