Tuesday, April 30, 2024

అక్రమ మైనింగ్‌కు అడ్డాగా రాష్ట్రం : పత్తిపాటి పుల్లారావు..

అమరావతి, ఆంధ్రప్రభ: అధికార పార్టీ రాష్ట్రాన్ని అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మార్చిందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు పంచుతామని చెప్పిన వైకాపా అధికారంలోకి వచ్చాక నలుదిక్కుల సహజ వనరులను దోచుకుంటుందని ఆరోపించారు. అక్రమార్జనే పరమావధిగా వైకాపా నేతలు మట్టిని సైతం వదలకుండా దోచుకుంటున్నారని, చెరువులు కూడా తోడేస్తున్నారని మండిపడ్డారు.

గ్రామస్ధాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకూ అక్రమ మైనింగ్‌ కు అధికార పార్టీ నేతలు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌ అంశాలను ఆయన వివరించారు. గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రధానంగా సాగుతున్న మైనింగ్‌ వ్యవహారాలను మీడియా ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో అక్రమ మైనింగ్‌ సాగుతుందని అధికార పార్టీ నేతలు కోట్లు గడిస్తున్నారని పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement