Friday, April 19, 2024

ఐశ్వర్య రాజేష్ “డ్రైవర్ జమున” ట్రైలర్ రిలీజ్.. థ్రిల్లింగ్ గా కాబ్ రైడ్..

మంచి సినిమా స్క్రిప్ట్ ల‌తో సినీ ఇండ‌స్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి ఐశ్వర్య రాజేష్. కాగా, యువ డైరెక్ట‌ర్ కిన్స్లిన్ దర్శకత్వంలో మరో కంటెంట్ బేస్డ్ మూవీ తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఐశ్వ‌ర్య‌. అవుట్ అండ్ అవుట్ రోడ్ ట్రిప్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ‘డ్రైవర్ జమున’ అనే సినిమాకి 18 రీల్స్‌కు చెందిన ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈరోజు లాంచ్ చేశారు మేక‌ర్స్.

ఐశ్వర్య రాజేష్ త‌న ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేక‌పోయిన కాబ్ డ్రైవ‌ర్ వృత్తిని ఎంచుకుంటుంది. అయితే, ఒక రైడ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది, ఆమెకు క‌లిగిన సమస్య నుంచి ఐశ్వర్య ఎలా బయటపడింది అనేది కథలో కీలకాంశం. ట్రైలర్‌ని బట్టి చూస్తే ఐశ్వర్య రాజేష్ తన అద్భుతమైన నటనతో సినిమాలో మ‌రింత‌ ఇంటెన్స్‌ని తీసుకొచ్చింది. కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మూవీ ట్రైల‌ర్ పూ పాజిటివ్‌వైబ్ ను పెంచుతాయి. కాగా ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement