Friday, May 3, 2024

అల్లు అర్జున్ తో సినిమా తీయాల‌ని ఉంది.. స్టార్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి

తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టారు. బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి సర్కస్ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో సౌత్‌ స్టార్‌ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు దక్షిణాది స్టార్లందరితో సినిమా తీయాలని ఉందన్నారు. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్‌, అజిత్‌, విజయ్‌, కార్తిలతో సినిమా తెరకెక్కించాలనుందని చెప్పారు. ఈ వార్తతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించి సర్కస్‌ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. రణ్‌వీర్ సింగ్‌ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్‌మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 23న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్‌లతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement