Thursday, September 23, 2021

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. సుమారు మూడు లక్షల 50 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు 33 గేట్ల ద్వారా ఇరిగేషన్ అధికారులు వదులుతున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఔట్ ఫ్లో రూపంలో గోదావరి నదిలోకి వదిలిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News