Tuesday, May 14, 2024

ఢిల్లీలో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. కన్నులపండువగా పుష్పయాగం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. మందిర్ మార్గ్ లోని శ్రీ బాలాజీ ఆలయంలో ఈనెల 12వ తేదీన అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. చివరి రోజైన ఆదివారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ స్థానిక సలహా మండలి ఛైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో పుష్పయాగం నిర్వహించారు. ఇందులో కమిటీ సభ్యులతో పెద్దఎత్తున పాల్గొన్నారు. వేద పండితుల నేతృత్వంలో జరిగిన ప్రత్యేక పూజల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మీనాక్షి లేఖి పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.

రెండో రోజు 13వ తేదీన ఉదయం గం. 8.30 నుంచి 9.00 మధ్య ధ్వజారోహణం, సాయంత్రం గం. 7.30 నుంచి 8.30 మధ్య పెద్దశేషవాహనం సేవలు నిర్వహించారు. 14వ తేదీన ఉదయం చిన్న శేషవాహనం, సాయంత్రం హంసవాహనం మీద స్వామివారిని ఊరేగించారు. 15వ తేదీన ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యాల పందిరి వాహనం, 16 ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలు జరిపారు. 17న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గం. 5.00 నుంచి గం. 7.00 వరకు కళ్యాణోత్సవం, గం. 7.30 నుంచి 8.30 వరకు గరుడ వాహనం సేవలు నిర్వహించారు. 18వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనం, 19వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరిగాయి. 20వ తేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనం, 21 ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement