Saturday, May 18, 2024

శ్రీశైలం, సాగర్‌లకు తగ్గిన వరద

శ్రీశైలం ప్రాజెక్టుకి వరద ప్రవాహం తగ్గుతున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో 2,17,638 క్యూసెక్కులుగా కాగా.. ఔట్‌ ఫ్లో 1,73,595 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు నాలుగు గేట్లు పది అడుగులు ఎత్తి నీటి దిగువకు వదులుతున్నారు. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం 884.40 అడుగుల మేర నీరుంది.

ఇక, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కూడా వరద ప్రవాహం తగ్గింది. వరద తగ్గడంతో అధికారులు 4 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో 1,09,246 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 68,190 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులు కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 312 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 306 టీఎంసీలు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement