Monday, April 29, 2024

SRH vs DC | స‌న్‌రైజర్స్ విధ్వంసం.. 6ఓవర్లలోనే 125..

అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ ఓపెనర్లు సిక్సులు ఫోర్లతో ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఉతికారేస్తున్నారు.. ట్రావిస్ హెడ్(84) బౌండరీల‌తో సెంచ‌రీ దిశ‌గా వెలుతున్నాడు.

కేవ‌లం 16 బంతుల్లోనే హెడ్ అర్థ శ‌త‌కం న‌మోదు చేశాడు. మ‌రో ఎండ్‌లో అభిషేక్ శ‌ర్మ‌ ( 11 బంతుల్లో 46) పరుగులు బాది తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దాంతో, హైద‌రాబాద్ 6 ఓవ‌ర్ల‌కే 125 ర‌న్స్ చేయగా… టైమౌట్ అనంతరం 7వ ఓవర్లలో 133 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement