Sunday, April 28, 2024

SRH | మహేష్ బాబును కలిసిన ఎస్‌ఆర్‌‌హెచ్ ప్లేయర్లు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లతో సమావేశమయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలను కలిశారు. వీరు క‌లిసిన ఫోటోల‌ను ఎస్‌ఆర్‌‌హెచ్ తమ అధికారిక X (ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. కాగా, దీనిపై ఎస్‌ఆర్‌‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మహేష్ బాబును టాలీవుడ్ ప్రిన్స్ అని అభివర్ణించారు. ఆయనను కలవడం ఎంతో ఆనందంగా అనిపించింది అని పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తొంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 5 గెలిచి ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో 3వ స్థానంలో నిలిచింది. కాగా, ఈ నెల 20న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన సన్‌రైజర్స్… ఆర్‌సీబీతో మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగానే సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు ఎస్‌ఆర్‌‌హెచ్ ప్లేయర్లు. ఇక ఈ నెల 25న హైదరాబాద్‌లో ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement