Sunday, May 5, 2024

Spl Story : హరితహారానికి సన్నద్ధం

  • తొమ్మిదో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
  • ఆయా శాఖలకు లక్ష్యం కేటాయింపు
  • మెదక్‌ జిల్లా టార్గెట్‌ 32.92 లక్షల మొక్కలు
  • డీఆర్‌డీవో ఆధ్వర్యంలో 18 లక్షల మొక్కలు
  • ప్రతి ఇంట్లో మొక్కలు నాటేలా ప్రణాళికలు
  • సంగారెడ్డి జిల్లా లక్ష్యం 40.76 లక్షలు
  • 659 నర్సరీల్లో సిద్ధంగా 69.11 లక్షల మొక్కలు

తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడతలు విజయవంతంగా పూర్తవగా తొమ్మిదో విడతను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మెదక్‌ జిల్లాలో 32.92 లక్షల మొకలు, సంగారెడ్డి జిల్లాలో 40.76 లక్షలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, శాఖల వారీగా టార్గెట్‌ నిర్ణయించింది. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచింది. పల్లెలు, పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు, రహదారులకు ఇరువైపులా, పొలం, చెరువు గట్లు, పరిశ్రమలు, కమ్యూనిటీ కేంద్రాల ఆవరణల్లో నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇళ్లలో గులాబీ, మందార, సీతాఫలం, జామ, ఉసిరి, అల్లనేరేడు, మునగ, కానుగ, తులసి, ఈత మొకలతో పాటు పలు ఔషధ, పూల మొకలను పెంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. వర్షాలు పడిన వెంటనే ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
– ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి మెదక్‌

తెలంగాణలో అడవి విస్తీర్ణం 33 శాతం పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ హరితహారాని శ్రీకారం చుట్టారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఎనిమిది విడతలుగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలో 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు జిల్లాల అధికారులు హరితహారం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాల్లోని అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీ-ల్లో పెద్ద ఎత్తున మొకలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నది. జిల్లాలో జూన్‌, జూలై మాసాల్లో మొకలు నాటేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. గ్రామాల్లోని నర్సరీల్లో పెంచిన మొకలను అదే గ్రామాల్లో నాటడానికి ఏర్పాట్లు- చేస్తున్నారు. మెదక్‌ జిల్లాలో 32.92 లక్షల మొకలు, సంగారెడ్డి జిల్లాలో 40.76 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

మెదక్‌ జిల్లాలో హరిత లక్ష్యం 32.92 లక్షలు…
9వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 469 పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో 75.05 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులోంచి 32,92,800 మొకలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 15 వేలు, ఎడ్యుకేషన్‌ 10 వేలు, బీసీ వెల్ఫేర్‌ వెయ్యి, ఫారెస్ట్‌ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షలు, ఉద్యానవన శాఖ 30 వేలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 25 వేలు, ఇరిగేషన్‌ శాఖ 40 వేలు, మార్కెటింగ్‌ శాఖ రెండు వేలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ రెండు వేలు, మైన్స్‌ అండ్‌ జియోలజీ 20 వేలు, మైనార్టీ వెల్ఫేర్‌ వెయ్యి, మెదక్‌ మున్సిపాలిటీ లక్ష, నర్సాపూర్‌ మున్సిపాలిటీ 81,800, రామాయంపేట మున్సిపాలిటీ- 50 వేలు, తూప్రాన్‌ మున్సిపాలిటీ- 60 వేలు, పోలీసు శాఖ 20 వేలు, ఎకై-్సజ్‌ శాఖ 25 వేలు, ఎస్సీ వెల్ఫేర్‌ వెయ్యి, టైబల్‌ వెల్ఫేర్‌ వెయ్యి, ట్రాన్స్‌కో వెయ్యి, పశు వైద్య శాఖ రెండు వేలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐదువేల మొక్కలు నాటనున్నారు.

సంగారెడ్డి జిల్లాలో హరిత లక్ష్యం 40.76 లక్షలు..
సంగారెడ్డి జిల్లాలో హరితహారం అమలుపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు-ంది. జిల్లాలోని 659 నర్సరీల్లో 69.11 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులోంచి ఈసారి 40,76,500 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్థారించారు. గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో 34,36,500 మొక్కలు, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 25 లక్షలు, అటవీ శాఖ 5 లక్షలు, ఎకై-్సజ్‌శాఖ లక్ష, ఉద్యానవన శాఖ లక్ష, పరిశ్రమల శాఖ లక్ష, జాతీయ రహదారుల శాఖ లక్ష, పోలీసు శాఖ 25 వేలు, విద్యాశాఖ ఐదు వేలు, వ్యవసాయ, దేవాదాయ, సంక్షేమ శాఖలు, జైళ్ల శాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ వెయ్యి చొప్పున మొక్కలు నాటనున్నాయి. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీ-ల్లో 6.40 లక్షల మొక్కలు నాటనున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్‌, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ-ల్లో లక్ష చొప్పు న, సదాశివపేట, బొల్లారం మున్సిపాలిటీ-ల్లో 70 వేల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టు-కున్నారు. జోగిపేట, నారాయణఖేడ్‌ మున్సిపాలిటీల్లో 50 వేల చొప్పున మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement