Sunday, April 28, 2024

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీ ప‌ర్య‌ట‌న.. మారుమూల గ్రామాల సమస్యలపై ఆరా!

బెజ్జూర్, (ప్రభ న్యూస్) : కోమురంబీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేశ్​కుమార్​ ఇవ్వాల సాయంత్రం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలు, ప్రాణహిత నది పరివాహక ఏరియాల్లో పర్యటించి ప్రజల బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ వాగు దాటడానికి ప్రయత్నిస్తున్న స్టూడెంట్స్​ ఇబ్బందులు గమనించి వారికి తమ సిబ్బందితో కలిసి సాయం చేశారు. ఆ తర్వాత వారు వెళ్తున్న దారిలో వర్షానికి చెట్లు పడిపోవడంతో తాళ్లతో వాటిని తప్పించారు. ఇట్లా పలు గ్రామాలకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారిని చర్యలు తీసకుంటామని తెలిపారు.

బెజ్జూరు మండలంలో సోమిని, మూగవెల్లి , పాపన్నపేట్, తలాయి, చింతల మానేపల్లి మండలం దిందా చిత్తమాగూడెం కోయపల్లి గ్రామాలను ఎస్పీ సందర్శించారు. చింతలమానపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దిందా గ్రామంలోని వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పాఠశాల పిల్లలు, ప్రజలు వాగుకు ఇవతలి వైపు ఉండటం చూసి వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత చిత్తమ గ్రామం, కోయపల్లి, గూడెం గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడారు.

పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని గ్రామస్తులకు ఎస్పీ తెలిపారు. పోలీస్ వారు రోడ్డుకు మొరం వేసి బాగు చేసిమందకు చిత్త్తమా ప్రజలు ఎస్పీ కి ధన్యవాదాలు తెలిపారు. కోయపల్లి యువతకి వాలీబాల్ కిట్లు అందించారు ఎస్పీ సురేశ్​కుమార్​. ఆ తర్వాత మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఐహెరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లారు. ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కి అక్కడ డీఎస్పీ అమూల్ ఠాగూర్, సిఐ శ్యామ్ గహరేలతో మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దుల మధ్య శాంతి భద్రతలు, సహకారం గురించి వీరు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా కాగజ్ నగర్ డి.ఎస్.పి కరుణాకర్, కౌటాల సిఐ బుద్ధ స్వామి, చింతల మానేపల్లి ఎస్సై విజయ్ , ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement