Monday, April 29, 2024

మే నెలలో పెరిగిన ద.మ.రైల్వే ఆదాయం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే నెలవారీ ఆదాయంలో భాగంగా మే నెలలో రికార్డు స్థాయిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది. మే నెలలో ప్రయాణీకుల రవాణా ద్వారా రూ.423.98 కోట్లు, సరుకుల రవాణా ద్వారా రూ.1,067.57 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత నెలలో 66 ప్రత్యేక రైళ్ళతో 266 ట్రిప్పులు నడిపించింది. అలాగే అదనంగా 1533 కోచ్‌లు ఏర్పాటు చేయడంతో 1.14.835 మంది ప్రయాణించారు.

ఈ చర్యతో మే నెలలో అత్యధిక ఆక్యుపెన్సీ నమోదు అయ్యిందని రైల్వే అధికారులు వెల్లడించారు. సరుకు రవాణాలో 11,731 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేశారు. దీంతో రూ.1,067.57 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా నూతన ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో మెరుగైన ఆదాయాన్ని ఆర్జించడానికి కృషి చేసిన ఆపరేటింగ్‌, కమర్షియల్‌ బృందాలను దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జ్‌ జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement