Saturday, May 11, 2024

SA vs IND: నేడు దక్షిణాఫ్రికా-భారత్ రెండో టెస్టు

కేప్‌ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య ఇవాళ్టి నుంచి రెండో టెస్టు జరుగనుంది. కాసేపట్లో ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఘోర ఓటమిని మరచి.. బరిలోకి దిగుతున్న టీమ్‌ఇండియా సిరీస్‌ను సమం చేయడంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్ శర్మ ముంగిట ఓ అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాతో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఈసారి కూడా సొంతం చేసుకునే అవకాశం లేదు. కానీ, సిరీస్‌ను డ్రా చేసుకొనేందుకు మాత్రమే ఛాన్స్ ఉంది. ఇలా చేస్తే.. సిరీస్‌ను డ్రా చేసుకున్న రెండో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలుస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement