Wednesday, May 1, 2024

‘శ్రీరామ్’ కి ‘సోనూసూద్’ మ‌ద్ద‌తు..విన్న‌ర్ అయ్యే ఛాన్స్ ఉందా…

బిగ్ బాస్5 స‌గంకి పైగా రోజులు గ‌డిచాయి. కాగా ప్ర‌స్తుతం న‌డుస్తోన్న బిగ్ బాస్ లో ఎన్నో ట్విస్ట్ లు జ‌రుగుతున్నాయి. జెస్సీని సీక్రెట్ రూంలోకి పంపారు. మ‌రి ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌ర‌నేదానిపై చ‌ర్చ న‌డుస్తోంది.. ప్ర‌స్తుతం హౌస్ లో రవి, మానస్, శ్రీరామ్, సన్నీ, అనీ మాస్టర్ లాంటి బలమైన కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ పోటీ నెల‌కొంది. కాగా స‌న్నీ, శ్రీరామ్ లాంటి కంటెస్టెంట్స్ బాగా యాక్టీవ్ గా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు టైటిల్ వీళ్ళే గెలుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రియ‌ల్ హీరో సోనూసూద్ .. సింగర్ శ్రీరామ్ కు తన మద్దతు తెలిప‌డం విశేషం. అతడి గురించి సోనూసూద్ మాట్లాడుతున్న వీడియో బైట్ వైరల్ గా మారింది. శ్రీరామ్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియో పోస్ట్ అయింది. ‘మీరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో శ్రీరామ్ ని చూస్తున్నారా .. నేను చూస్తున్నాను. శ్రీరామ్ కి నా బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నాను.ఇలాగే హౌస్ లో నీ బెస్ట్ ఇవ్వు శ్రీరామ్ అని సోనూసూద్ ప్రోత్సహించాడు. సడెన్ గా సోనూసూద్ లాంటి క్రేజీ నటుడు శ్రీరామ్ కి మద్దతు తెలపడం ఆసక్తిగా మారింది. అయితే శ్రీరామ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement