Monday, April 29, 2024

సోనూసూద్ మరో ఘనత

కరోనా లాక్‌డౌన్ సమయంలో రియల్ హీరోగా నిలిచిన సోనూసూద్ మరో ఘనత సాధించాడు. సోనూ చేస్తున్న సహాయ కార్యక్రమాల వల్ల సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో సోనూసూద్ ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్‌ల మార్కును అధిగమించింది. దీంతో పలువురు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన సోనూ.. రియల్ లైఫ్‏లో తన దాతృత్వానికి హద్దులు లేవంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వారి గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటికీ తన సేవానిరతిని కొనసాగిస్తున్న ఆయన కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అనేక సాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ సాయానికి మరో పేరుగా నిలిస్తున్నారు. ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి‘ఆచార్య’సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా కోసమే హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతూ సందడి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement