Tuesday, March 26, 2024

కాజల్ అగర్వాల్ రెడీ

చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ కాజల్ అగర్వాల్. కెరీర్ ఆరంభం నుంచి వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం గోష్ఠి అనే టైటిల్ తో సినిమా చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ఎస్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ జనవరి లో ప్రారంభించారు.

అయితే ఇప్పుడు మే నెలాఖరుకి రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ సినిమాల విషయంలో మరింత స్పీడ్ పెంచింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇటీవల మోసగాళ్ళు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ఆచార్య, భారతీయుడు 2 చిత్రాల్లో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement