Monday, April 29, 2024

26న ఈడీ విచారణకు సోనియాగాంధీ.. ఆ సమయంలో గాంధీ భవన్‌లో సత్యాగ్రహం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఈ నెల 26న గాంధీభవన్‌లో సత్యాగ్రహం చేపట్టనున్నట్లు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ , కార్యక్రమాల ఇన్‌చార్జి మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రకటించారు. 26న సోనియాగాంధీ ఈడీ కార్యాలయంలో విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చే వరకు సత్యాగ్రహం చేపడతామని ప్రకటించారు.

గాంధీ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహం ప్రారంభమవుతుందన్నారు. సత్యాగ్రహంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ కార్యవర్గం, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుడు డీసీసీ ఆఫీస్‌ బేరర్ల తోపాటు ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త పాల్గొంటారని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement