Sunday, May 5, 2024

ప‌దేళ్ల జీవిత ప్ర‌యాణం…వీడియోతో..

నాగశౌర్య, శ్రీనివాస అవసరాల కాంబినేషన్‌ చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ల సహ నిర్మాత. మాళవిక నాయర్‌ నాయికగా నటిస్తోంది. ఇదే నెల 17న విడుదల చేస్తున్నారు. హీరో హీరోయిన్‌ పదేళ్ల జీవిత ప్రయాణాన్ని ఏదు దశల్లో ఆవిష్కరించిన చిత్రమిది. సోమవారం మరో పాటని చిత్ర బృందం విడుదల చేసింది. ఇది టైటిల్‌ సాంగ్‌. హీరో హీరోయిన్‌ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది ? వారి ప్రయాణం ఎలా సాగింది? అనే విషయాలను తెలుపుతూ సాగే పాట ఇది. కల్యాణి మాలిక్‌ సంగీతం అందిస్తూ, నూతన మోహన్‌తో కలిసి ఆలపించారు. సాహిత్యం భాస్కరబట్ల అందించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement