Friday, May 3, 2024

ఈనెలలోనే సూర్యగ్రహణం.. ఎప్పుడంటే..

2021 సంవత్సరపు చివరి సూర్య గ్రహణం ఈనెల 4వ తేదీన ఆవిష్కృతంకానుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈ సూర్య గ్రహణాన్ని వీక్షించ గలుగుతాయి. దక్షిణ అర్ధగోళంలో కొంత మంది వ్యక్తులు శనివారం సూర్యుని సంపూర్ణ లేదా పాక్షిక గ్రహణాన్ని వీక్షించగలరని నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) ప్రకటించింది. ఇక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే భాగ్యం అంటార్కిటికాకు మాత్రమే లభించనుంది. సెయింట్‌ హలెనా, సౌత్‌ జార్జియా, శాండ్‌విచ్‌ దీవులు, క్రోజెట్‌ దీవులు, నమీబియా, లెసోతో, దక్షిణాఫ్రికా, ఫాక్‌లాండ్‌ దీవులు, చిలీ, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలవు. భారతదేశంలో ఇది దాదాపుగా కనిపించదని నాసా తెలిపింది.

సూర్యుడు-భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించి నప్పుడు భూమిపై నీడ ఏర్పడుతుంది. కొన్ని ప్రాంతాలలో సూర్యకాంతి పూర్తిగా లేదా పాక్షికంగా నిరోధించినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. డిసెంబర్‌ 4న ఉదయం 5:29 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఉదయం 07:00 గంటలకు, సంపూర్ణ గ్రహణం ప్రారంభమవుతుంది. 07:33 గంటలకు గరిష్ట గ్రహణం ఏర్పడుతుంది. 08:06 గంటలకు పూర్తి గ్రహణం ముగుస్తుంది. 09:37 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement