Monday, April 29, 2024

పాముని ముద్దాడిన వ్య‌క్తి – ప్రాణాపాయ‌స్థితిలో ‘ఆకాష్’

పాముతో గేమ్సా, ఎంతైనా పాము పామే. పాలు పోసినంత‌మాత్ర‌న కాటు వేయ‌దా అన్న‌ట్టు.. ఓ వ్య‌క్తి ఓ పాముని ప‌ట్టుకున్నాడు. అంత‌టితో ఆగాడా దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. అది కూడా లిప్ కిస్. సెల్ఫీలు , ఫొటోలు అంటూ హంగామా చేశాడు. మ‌రి పాము ఊరుకుంటుందా.. క‌స్సుమ‌ని కాటు వేయడంతో ప్రాణాపాయస్థితిలో ఉన్నాడావ్య‌క్తి. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ గాజుల రామారం డివిజన్ కట్ట మైనమ్మబస్తీలో నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంతో దిట్ట అయిన ఆకాష్ , జనవాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తరువాత సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement