Friday, April 26, 2024

తెలంగాణలో ఆరు కొత్త మెడికల్ కాలేజీలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరు కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు రానున్నాయి. ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా అధికారులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యవిద్య అందించే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ఉండగా కొత్తగా మంజూరు చేసిన కాలేజీలతో కలిపి ఈ సంఖ్య 15కి చేరనుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈఎస్‌ఐ, బీబీనగర్‌ ఎయిమ్స్‌తో కలిసి రెండు కాలేజీలు విద్యార్థులకు అందుబాటులో ఉలన్నాయి. ప్రైవేట్ పరిధిలో మరో 23 కాలేజీలు ఉన్నాయి. ఇలా మొత్తం తెలంగాణలో వైద్య కళాశాలల సంఖ్య 40కి చేరనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో ఉన్న 9 మెడికల్ కాలేజీల్లో 1,640 సీట్లు ఉన్నాయి. కేంద్రం పరిధిలో ఉన్న ఈఎస్ఐ, ఎయిమ్స్‌లో కలిపి 150 సీట్లు ఉన్నాయి. కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసిన కాలేజీల్లో 600 నుంచి 1200 సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement