Monday, May 6, 2024

జోరు తగ్గని సీతా రామం.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..

మ‌ల‌యాల సూప‌ర్ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా హను రాఘవపూడి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కిన సినిమా సీతారామం.. దేశ‌భ‌క్తికి ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమా అద్భుతమైన‌ ప్రేమ‌కావ్యంగా తెలుగు ప్రేక్ష‌కుల్ని మ‌న‌స్సు మెప్పించింది. సీతారామం రిలీజ్ అయ్యి నెల రోజుల దాటినా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ల జోరు ఇంకా త‌గ్గ‌లేదు. నెల రోజుల్లో ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కులుపుకుని 40 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది ఈ సినిమా. ఇక‌పోతే వ‌ర‌ల్డ్ వైడ్‌గా 84 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టింది.

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది అభిమానుల్లో ఉత్కంఠ‌త రేపుతుంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబ‌ర్ 9న అమెజాన్ ప్రైమ్‌లో సీతారామం రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. భారీ ధ‌ర‌కు సీతారామం డిజిట‌ల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఈ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement