Wednesday, April 24, 2024

Breaking: తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 6 ప్రారంభం.. హోస్ట్‌గా కింగ్ నాగార్జున హ‌ల్‌చ‌ల్‌!

తెలుగు ప్రేక్షకులకు మరో మూడు నెల‌ల‌ పాటు వినోదం అందించేందుకు బిగ్ బాస్ వచ్చేశాడు. బిగ్ బాస్ సీజన్-6 ఇవ్వాల‌ సాయంత్రం స్టార్ మా చానల్లో అట్టహాసంగా ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చారు. “కొత్తగా ట్రై చేయాలంటే నా తర్వాతేరా” అంటూ డైలాగ్ చెప్పి అంద‌రినీ అలరించారు. బంగార్రాజు పాటకు మోడల్స్ తో కలిసి డ్యాన్స్ చేశాడు కింగ్ నాగ్‌. ఇక‌..
బిగ్ బాస్ కొత్త‌ సీజన్ లో మొట్టమొదటగా కార్తీకదీపం సీరియల్ నటి కీర్తి భట్ హౌస్ లోకి ఎంటర‌య్యింది. కీర్తి కార్తీకదీపంలో సీరియల్ లో హిమ పాత్ర పోషిస్తోంది.

బిగ్ బాస్ ఇంట్లోకి అందరికంటే మొదట అడుగుపెట్టినప్పుడు కీర్తి ఆనందం అంతాఇంతా కాదు. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్ గా సినీ నటి పింకీ (సుదీప) ఎంట్రీ ఇచ్చింది. పింకీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నువ్వు నాకు నచ్చావ్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన పింకీ.. నాగార్జునను తమను క్రమశిక్షణలో పెట్టే టీచర్ గా భావిస్తామని చెప్పింది. ఆపై మూడో కంటెస్టెంట్ గా శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్ గా ప్రముఖ యాంకర్ నేహా చౌదరి హౌస్ లోకి అడుగపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement