Monday, April 29, 2024

థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో సింగరేణి రికార్డు.. 100 శాతం పీఎల్‌ఎప్‌ మార్కుదాటిని సింగరేణి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంగా రికార్డు సాధించింది. దేశ వ్యాస్తంగా ఉన్న 250 ప్రభుత్వ, ప్రయివేట్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కేంటే సింగరేణి థర్మల్‌ కేంద్రం ఈ నవంబర్‌ నాటికి అత్యధిక లోడ్‌ ( పీఎల్‌ ఎఫ్‌) ప్యాక్టర్‌ను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోని 8 నెలల కాలంలో పీఎల్‌ఎఫ్‌ 90.86 శాతంతో ఈ ఘనతను సాధించింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ప్రారంభించి కేవలం 6 ఏళ్లే అవుతున్నా మొదటి ఉంచి ఈ ప్లాంట్‌ అత్యుత్తమ పీఎల్‌ఎఫ్‌తో దేశంలోని 25 అత్యుత్తమ ప్లాంట్ల జాబితాలో అగ్రస్థానాల్లో నిలుస్తూ వస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో అత్యుత్తమంగా 88.97 శాతం పీఎల్‌ఎఫ్‌తో మొదటి స్థానంలో నిలిచింది.

అదే విభాగంలో 2020-21లో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఈసారి ప్రభుత్వ , ప్రయవేట్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో సింగరేణి థర్మల్‌ ఏకంద్రం మొదటి స్థానంలో ఉండగా.. ఛత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలోని ఎన్టీపీసీ కోర్బా సూపర్‌ పవర్‌ థర్మల్‌ స్టేషన్‌ 90.01 శాతం పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలవగా.. ఎన్టీపీసీకే చెందిన సింగ్రౌలి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ 89.94 శాతం పీఎల్‌ఎఫ్‌తో మూడో స్థానంలో నిలచింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం తెలంగాణ ప్రతిభను చాటింది.

- Advertisement -

నాలుగుసార్లు 100 శాతం పీఎల్‌ఎఫ్‌ దాటిని సింగరేణి..

సింగరేణిలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మొదటి నుంచి విజయాలు సాదిస్తోంది. ఇప్పటీ వరకు 100 శాతం పీఎల్‌ఎఫ్‌తో నాలుగు సార్లు విజయం సాధిస్తూ తన ప్రతిభను చాటుకున్నది. 2018 సెప్లెంబర్‌, 2019 ఫిబ్రవరి, 2020 ఫిబ్రవరి, 2022 మార్చి నెలల్లో వంద శాతానికి పైగా పీఎల్‌ఎఫ్‌ సాధించడం విశేషం. ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్‌ ఇప్పటీ వరకు 10 సార్లు, మొదటి యూనిట్‌ ఏడు సార్లు వంద శాతం పీఎల్‌ఎఫ్‌ మార్కును దాటాయి.

సోలార్‌లోనూ సింగరేణి ముందంజ..

రాష్ట్ర విభజన తర్వాత సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థలలో సింగరేణి సంస్థ ముందంజలోనే ఉన్నది. ఇప్పటికే 219 మొగావాట్ల ప్లాంట్లను విజయవంతం చేసింది. మూడో విడతలో 81 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటులో భాగంగా త్వరలోనే సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌ ఆవరణలోని నీటి రిజర్వాయర్‌లో కూడా 15 మెగావాట్ల ప్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. సింగరేణి థర్మల్‌, సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో రాష్ట్ర విద్యుత్‌ అసవరాలు తీర్చడంతోపాటు సింగరేణి సంస్థకు లాభాలు చేకూర్చుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement