Friday, May 3, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని క‌ల‌వాల‌ని ఉంది – మిస్ ఇండియా వరల్డ్ గా ఎంపిక‌యిన సినీ శెట్టి

తాజాగా మిస్ ఇండియా వరల్డ్ గా ఎన్నికైన కన్నడ యువతి సినీ శెట్టి హీరో విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ స్టార్ హీరో అని చెప్పింది. ఆయనను కలిసే సందర్భం వస్తే చాలా సంతోషిస్తానంది. పెళ్లిచూపులు , టాక్సీవాలా, అర్జున్ రెడ్డి , గీతగోవిందం వంటి సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ప్రస్తుతం లైగర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ పెరిగింది .అక్కడ కూడా పలువురు స్టార్ సెలబ్రెటీలు విజయ్ దేవరకొండ ఫేవరెట్ హీరో అని చెప్పుకోవడం అతని క్రేజ్ కి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల ముంబైలో ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చిన అభిమానులను చూసి బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి చూస్తే విజయ్ దేవరకొండకు అభిమానులలో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement