Wednesday, May 1, 2024

బీజేపీ నేత‌ విష్ణు కుమార్ రాజుకు షోకాజ్ నోటీసు జారీ

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రాథమిక సభ్యత్వం నుంచి ఎందుకు తప్పించకూడదంటూ షోకాజ్ నోటీసులో పేర్కొంది. ఇవాళ సాయంత్రంలోగా షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పొత్తులపై మీడియాతో ఇష్టానుసారంగా మాట్లాడారనే అభియోగంపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. పొత్తులపై వివిధ సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లని బీజేపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. బీజేపీ ఢిల్లీ పెద్దల సూచనలతో బీజేపీ ఏపీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుల‌కు విష్ణువ‌ర్ధ‌న్ రాజు స‌మాధానం ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement