Saturday, April 27, 2024

TS | రిలయన్స్ డిజిటల్‌లో షాట్ స‌ర్క్యూట్.. చెలరేగిన మంటలు

వరంగల్, (ప్రభ న్యూస్) : వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సెంటర్‌లోని జకోటియా గ్రాండ్ సెంట్రల్ (రిలయన్స్ డిజిటల్) భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. రిలయన్స్ డిజిటల్ ఉన్న భ‌వ‌నంలో (గురువారం) రాత్రి 7 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి కాంప్లెక్స్ మొత్తం దగ్ధమైంది. స్థానికులు ఫైర్ ఇంజన్‌కు ఫోన్ చేయడంతో రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. షార్ట్ సర్క్యూట్ జరిగిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement