Friday, May 3, 2024

చేనేత చీర‌లో మెరిసిన శోభిత ధూళిపాల – వైర‌ల్ గా ఫొటో

శోభిత ధూళిపాల బాలీవుడ్ కే కాదు టాలీవుడ్ కి ప‌రిచ‌య‌స్తురాలే. అడ‌విశేషు న‌టిస్తోన్న మేజ‌ర్ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ లో ఆదిత్య‌రాయ్ క‌పూర్ తో క‌లిసి నైట్‌ మేనేజర్‌’రీమేక్‌లో నటిస్తుంది. రిలాక్స్ కోసం శ్రీలంక వెళ్లిందీ భామ‌. అక్కడి ప్రకృతి అందాలకు పరవశించిపోతూ.. తన భావుకతతో, ఛాయా చిత్రాలతోశ్రీలంకను సప్తవర్ణ శోభితంగా మారుస్తోంది. తాను ఆస్వాదించిన ప్రతి అనుభూతిని సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నది. ‘నా హృదయమనే పక్షి.. రెక్కలల్లార్చి స్వేచ్ఛగా విహరిస్తున్నది’ అంటూ తనలోని రచయిత్రిని మేల్కొలిపింది. చేనేత చీర కట్టులో, కొబ్బరికాయ పట్టుకుని శోభిత దిగిన ఫొటో వైరల్‌గా మారింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement