Saturday, December 7, 2024

Vizag : ఈతకు వెళ్లి ఏడుగురు విద్యార్థుల గల్లంతు…

ఈతకు వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ లో ఏడుగురు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదశాత్తు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు క్షేమంగా బయటకు వచ్చారు.

మరో విద్యార్థి బయటకు రాలేదు. సమాచారం అందుకున్న గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా గల్లంతైన విద్యార్థి కోసం ఎలాంటి గాలింపు చర్యలు చేపట్టడం లేదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కనీసం మృతదేహాన్ని అయినా అప్పగించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement