Wednesday, May 8, 2024

అల్లు బ్రదర్స్ పై.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమానిగా బండ్ల గణేష్‌కు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. అంతేకాదు ఈయన ట్విట్టర్‌లో వేసే ట్వీట్స్‌ క్షణాల్లో వైరల్‌ అవుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈయన అల్లు బ్రదర్స్‌పై చేసిన కొన్ని కామెంట్స్‌ తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో బండ్ల గణేష్‌, అల్లు బాబీతో కలిసి ఫోటోలు దిగాడు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ ‘అందరికి చెబుతున్నా.. దయచేసి తండ్రి మాట వినొద్దు. తండ్రి మాట వింటూ పెరిగితే మా బాబీ గారిలా అవుతారు. తండ్రి మాట వినకుండా నచ్చింది చేస్తే మా హీరో బన్నీగారిలా అవుతారు.

బాబీగారిలా కావాలా, బన్నీగారిలా అవ్వాలా అనేది మీరే నిర్ణయించుకోండి. అల్లు బాబీ గారు చిన్నప్పటి నుంచి బాగా చదువుకుని తండ్రి మాట వింటూ పెరిగారు. అందుకే ఇలా ఉన్నారు. కానీ అల్లు అర్జున్ తండ్రి మాట వినకుండా ఇష్టమొచ్చింది చేసుకుంటూ వెళ్లారు. కాబట్టే ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. బట్టి ప్రతి ఒక్కరూ సొంత నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కొందరు పాజిటీవ్‌గా స్పందిస్తే, మరికొందరు నోటీకి అద్దు అదుపు లేదా? ఏది పడితే అది మాట్లాడటమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అభిమానులు మాత్రం ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్‌పై ఫైర్‌ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement