Sunday, May 5, 2024

5.3 టన్నుల కొకైన్‌ పట్టివేత

ఇటలీకి సమీపంలోని సిసిలియన్‌ తీర ప్రాంతంలో 5.3 టన్నుల కొకైన్‌ను మాదక ద్రవ్యాల నిరోధక అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ ఆపరేషన్‌లో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న కొకైన విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 946 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. నిఘా వర్గాల సమాచారంతో దక్షిణ అమెరికా నుంచి వస్తున్న ఓడ నుంచి విసిరిన ప్యాకేజీలను సేకరిస్తున్న ఫిషింగ్‌ ట్రాలర్‌ నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు సిసిలియన్‌ ప్రాంతీయ అధ్యక్షుడు రెనాటో షిఫానీ వెల్లడించారు.

ఇటలీ దేశ చరిత్రలో అతిపెద్ద మాదక ద్రవాల స్వాధీనమని పేర్కొన్నారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌లో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు ట్యునీషియన్లు, ఇటాలియన్‌, అల్బేనియన్‌, ఫ్రెంచ్‌ జాతీయుడు ఉన్నారు. డ్రగ్స్‌ రాకెట్‌ ముఠాను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన నార్కోటిక్‌ అధికారులను సిసిలియన్‌ ప్రాంతీయ అధ్యక్షుడు రెనాటో షిఫానీ ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement