Thursday, May 2, 2024

దూసుకుపోతోన్న సీతారామం- 50కోట్ల గ్రాస్ క‌లెక్ట్

మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కి తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. కాగా ఇటీవ‌ల‌ విడుద‌లైన సీతారామంతో తెలుగులో త‌న మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు దుల్క‌ర్. ఆగ‌స్టు 5న విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకుపోతుంది. దుల్క‌ర్‌కు జోడీగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించింది. ర‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కీల‌క పాత్ర పోషించింది. న‌టుడు సుమంత్, త‌రుణ్ భాస్క‌ర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. సీతారామం చిత్రం తాజాగా 50కోట్ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసింది. దాంతో టాలీవుడ్‌లో 50కోట్ల క్ల‌బ్‌లో చేరిన మొద‌టి మాలీవుడ్ హీరోగా దుల్క‌ర్ రికార్డు సృష్టించారు. హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ అంద‌మైన ప్రేమ‌కావ్యాన్ని వైజ‌యంతి ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ నిర్మించారు. ఈ చిత్రంలో దుల్క‌ర్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో న‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement