Monday, April 29, 2024

శాసన సభ్యులపై గౌరవం ఉంది

శాస‌న స‌భ్యుల హ‌క్కుల‌కు భంగం క‌లిగించాలన్న ఉద్దేశం తనకు లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగ్డ స్పష్టం చేశారు. మంత్రుల ఫిర్యాదుపై ఏపీ ప్రివిలేజ్ క‌మిటీ ఎస్ఈసీ నిమ్మ‌గడ్డ‌కు నోటీసులిచ్చింది. అయితే, తాజాగా దీనిపై నిమ్మ‌గ‌డ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన‌కు స‌భ‌పై అత్యున్న‌త గౌర‌వం ఉంద‌ని, తాను స‌భ్యుల హ‌క్కుల‌కు భంగం క‌లిగేలా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని నిమ్మ‌గ‌డ్డ పేర్కొన్నారు. సభ్యుల హక్కులకు భంగం కలిగించాలని ఉద్దేశం తనకు లేదని నిమ్మగడ్డ చెప్పారు. తాను అస‌లు ప్రివిలేజ్ క‌మిటీ ప‌రిధిలోకే రాన‌ని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.
కాగా, పంచాయితీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా ఉన్న నిమ్మ‌గ‌డ్డ‌, ప్ర‌భుత్వంలోని మంత్రులు, కొంద‌రు ఎమ్మెల్యేల మధ్య ఆరోప‌ణ‌లు-ప్ర‌త్యారోణ‌ప‌లు జ‌రిగాయి. ముఖ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌.. ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. దీనిపై సభా హక్కుల కమిటీ ఇప్పటికే సమావేశమైంది. ఫిబ్రవరి 7న ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రి పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆయన ఎన్నికల నిర్వహణ చేయకూడదని, మీడియా సమావేశాల్లో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దీంతో తన హక్కులకు భంగం కలిగించారంటూ స్పీకర్‌కు మంత్రి మరో ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై బుధవారం చర్చించిన కమిటీ.. గురువారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు నోటీసులు పంపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement