Saturday, May 4, 2024

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు : మంత్రి కేటీఆర్

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో వివిధ పథకాల మహిళా లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ మాటామంతిగా మాట్లాడుతూ.. అంగన్ వాడీ, ఆశా వర్కర్లను ఆదుకుంటున్నామన్నారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్రం నిధులివ్వకున్నా.. సొంత నిధులతో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేసీఆర్ హయాంలో పెన్షన్ పదిరెట్లు పెరిగిందన్నారు. 4లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఎవరూ అడగకపోయినా ప్రభుత్వం పెన్షన్ ఇస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement